నేను మెడికల్ ఫీల్డ్ వదిలేసాక ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. రకరకాల ఆలోచనలతో సతమతమైనాక అకస్మాత్తుగా వంశ వృక్షం సంకలనం చేయాలనిపించింది. ఇతర దేశాలలో ఈ వంశవృక్షానికి చాలా ప్రాముఖ్యం ఉందని విన్నాను. దాని గురించి తెలుసుకుందాం అని ఇంటర్నెట్‌లో వెతికాను. చదివిన కొద్దీ నా కుతూహలం పెరుగుతూ వచ్చింది. నా చిన్నప్పుడు కొదమసింహం వంశానికి చెందిన వంశవృక్షం చూడటం తటస్థించింది. అది కేవలం ఒక పెద్ద టేబుల్ లాగా కనిపించింది. అది పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు బోధపడ్డాయి. కేవలం పురుషులే అందులో కనబడ్డారు. స్త్రీలకు అందులో చోటు లేదు. కారణం స్త్రీలు వివాహానంతరం ఇంటిపేరు, గోత్రం అన్నీ మారిపోయి భర్త ఇంటిపేరు గోత్రం సంక్రమిస్తాయి. అంటే వారి స్వాతంత్ర్యం వివాహముతో సరి! ఇతర దేశాలలోని పద్ధతులను చూస్తే వారు సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తారు అది నాకు చాలా నచ్చింది. అందులో స్త్రీ కాని పురుషులు కాని ఒక పేరు టైప్ చేయగానే ఒక బాక్సులో వారి పేరు రావడమే కాక ప్రక్కనే ఇంకొక బాక్సులో స్పౌస్ అని వస్తుంది. దానిలో స్త్రీ వివాహ పూర్వము ఉన్న ఇంటిపేరు (పుట్టింటి పేరు) వ్రాయవచ్చును. ఇంతేకాక అందులో అందరి ఫోటోస్ కూడా పెట్టవచ్చును. ఇంకా వారి జీవితములలో సంపాదించిన పేరు ప్రతిష్ఠలు వారి వంశంలో ప్రసిద్ధులైన వారి గురించి వ్రాయవచ్చును. ఇది చాలా బాగుంది అనిపించింది.
అదే సమయములో నాకు వరుసకు సోదరుడైన రాజాజి నీ సంప్రదిస్తే, మాకు వరుసకు పెదనాన్నగారైన వెంకటాచార్యుల గారి కుమారులు శ్రీనివాస అయ్యంగార్ ఈ విషయముల్లో కొంత పరిశ్రమ చేసినట్లు చెప్పారు. తర్వాత కొన్నాళ్లకు ఒక సంక్షిప్తమైన ఒక వంశవృక్షమును తెచ్చాడు. దానిని ఆధారంగా చేసుకొని ఎక్కడెక్కడ కౌశిక నల్లాన్ చక్రవర్తుల వారు ఉన్నారో వారిని కలుసుకొని చాలావరకు సంకలనం చేసాను. కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగించి మా పైన 14 తరాల వారి పేర్లను సంకలనమూ చేసాను. 250 కి పైగా ఫొటోలు అందులో పెట్టాను. ఈ ప్రాజెక్టు దాదాపు అనంతమైనది కనుక నా ఈ ప్రయత్నం కుతూహలం ఉన్న ఎవరైనా పొడిగించవచ్చును. దాని వల్ల ఈ వంశ వృక్షము శాఖోపశాఖలు గా విస్తరిస్తుందని ఆశిస్తున్నాను.
ఇట్లు
మీ
స్వర్గీయ శ్రీ యన్. సి. వేణుగోపాల్
B.Sc., B Pharm.
After I left the medical field, I began wondering what to do. After much deliberation, it suddenly occurred to me to compile a family tree. I had heard that in other countries such family trees hold great importance, so I searched the internet to learn about them, and the more I read, the more my curiosity grew. When I was young I happened to see a family tree belonging to the Kodamasimham lineage — it looked merely like a large table. Studying it, a few things became clear: only the men appeared in it, and women had no place. This is because, after marriage, a woman's house-name and gotram change entirely and she takes on her husband's — as if her own independent identity ends with marriage! Looking at the methods used in other countries, I liked very much that they use software, in which, when you type a name — whether of a woman or a man — their name appears in one box and, right beside it, another box for the spouse, where a woman's pre-marriage house-name (maiden name) can be entered. Beyond that, everyone's photos can be added, and the names, honours and renowned people of the lineage can be recorded. This appealed to me greatly.
Around the same time, when I consulted Rajaji — who is as a brother to me — he told me that Srinivasa Ayyengar, son of Venkatacharyulu garu (our pedananna — father's elder brother), had done some work on this subject. After a few days he brought a brief family tree. Using that as a basis, I met the Kousika Nallan Chakravarti family wherever they were and compiled most of it. Using new software I compiled the names of fourteen generations above us, and placed more than 250 photographs in it. Since this project is almost endless, anyone with the curiosity may extend my effort — through which I hope this family tree will spread into ever more branches and sub-branches.
Yours,
Late Sri N. C. Venugopaal
B.Sc., B Pharm.
శ్రీవైష్ణవ సాంప్రదాయం – ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి అత్యంత సులభమార్గం. ఈ మార్గంలో 'శరణాగతి' ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. భగవద్రామానుజులవారు (క్రీ॥శ॥1017) ఈ మార్గాన్ని వారు వీరు అని తేడా లేకుండా అందరికి అందించారు. వేద ప్రమాణాలతో బ్రహ్మసూత్రాలకు 'శ్రీభాష్యం' వ్రాశారు. శ్రీరామానుజుల వారి తర్వాత శ్రీమణవాళ మహాముని లు (క్రీ॥శ॥1443) శ్రీ రంగంలో శ్రీవైష్ణవ పీఠాన్ని అధిరోహించారు. శ్రీరామానుజుల సిద్ధాంత వ్యాప్తికై ఎనలేని సేవలు చేసి దేశ నలుమూలాలలో ఈ సాంప్రదాయ ప్రచారానికై అష్టదిగ్పాలకులను గొప్ప ఆచార్య పురుషులను నియమించారు. అంతేకాదు 74 పీఠాలను స్థాపించారు. వారిలో అత్యంత ప్రముఖులు నల్లాన్ అని పిలువబడే ఆచార్యపురుషులు. వీరికే "నల్లాన్ చక్రవర్తుల" వారు అని కూడా వ్యవహారము.
"నల్లాన్ చక్రవర్తులు" అంటే?
వీరు గొప్ప శ్రీ వైష్ణవ ధర్మములను ఆచరించినవారు. విశాల హృదయములు మానవతావాదులు. 'కౌశిక' 'కౌండిన్యస' 'శ్రీవత్స' గోత్రికులు పంచార్చిత ప్రవరకలవారు. వీరికి మూల పురుషులు శ్రీ నాధమునుల కాలం నాటి వారు 'ఉరుస్పట్టార్ ఆచ్చాన్' అనువారు. వీరు శ్రీ నాధమునుల నాశ్రయించి ఉభయవేదాంతాలు క్షుణ్ణముగా అభ్యసించినారు. తర్వాత కాలంలో వీరి వంశంలో "ఆచ్చాన్" అను పేరుతో శ్రీ కాంచీపురంలో నివసించిన మహాభాగవతులు శ్రీమణవాళ మహాముని శ్రీ పాదాలను ఆశ్రయించారు. వీరు దయామయులు సకల జీవకోటిని శ్రీమహావిష్ణు సంబంధముగా గుర్తించి సేవలు చేసి తరించిన ఉదార పురుషులు. ఇక్కడ ఒక చిన్న ఐతిహ్యాన్ని తెలుసుకుందాం!
ఆచ్చాన్స్వామి కంచి వరదుని రోజూ సేవించే వారు. ఒకరోజు స్వామి దేవాలయమునకు బయలుదేరిరి. దారిలో ఎవరో ఆగంతుక వైష్ణవస్వామి, ఊర్ధ్వపుండ్రమలు తులసిమాలలను ధరించి దేహత్యాగము చేసి పడి ఉండిరి – వారు ఎవరు? ఏ ప్రాంతమువారు? ఎందుకిట్లు పరమపదించిరో ఎవరికీ తెలియదు. అందరూ వారి పార్థివ శరీరాన్ని చూసి అయ్యో! అని వెళ్ళిపోవుచుండిరి. ఆ సమయానికి వచ్చేసిన ఆచ్చాన్ స్వామి, వారిని చూసి ఆహా! ఎవ్వరీ మహానుభావుడు స్వామి సన్నిధిని పరమ పదించిరే? వీరి పార్థివదేహ సంస్కారము ఎవరు చేయగలరు! అని వగచి అనాధగా మరణించిన వారికి కులగోత్రముల పని లేదు. వారికి స్వయముగా నేనే ప్రేత సంస్కారములు చేయుటయే శ్రీరామానుజుల ఆజ్ఞ అగునని ఉదారబుద్ధితో ఎవ్వరూ చేయని విధముగా సంస్కారముల నన్నిశాస్త్రోక్తముగా జరిపారు. శ్రీ కంచి వరదరాజస్వామి అర్థకముఖముగా వీరిని గూర్చి – "నాట్టుక్కు పొల్లాన్– నమక్కు నల్లాన్" అని (ఆచ్చాన్ స్వామి ఊరివారికి చెడ్డవాడు–మాకు మంచివాడు) పలికినవారు. ఊరివారందరూ అనాధప్రేత సంస్కారము చేసినందుకు వెలివేయగా భగవంతుడు వీరిని నల్లాన్, నల్లాన్ అని పిలుచుటచే వీరికి నల్లాన్ వారు అని పేరు కంచి వరదుని అనుగ్రహముగా మారినది. పిదప వీరిని ఆశ్రయించి ఎందరెందరో తరించినారు. వీరుకొండ కోనలలో వారికి ఆటవికులకు కూడా పంచ సంస్కారాలు తిరుమంత్రోపదేశము శ్రీరామానుజ ఆజ్ఞగా ప్రసాదించినారు. "సమీచీనార్యులు" అని కూడా వీరికి పేరు కలదు.
రెండవ ఐతిహ్యము – ఒక పర్యాయము క్రిమికంఠచోళుడు శ్రీరంగములోని శ్రీరామానుజుల వారికి ప్రాణహాని తలపెట్టగా శ్రీరామానుజులు కాషాయంబు వదిలి శ్వేత వస్త్రాలని ధరించి అడవులగుండా మేల్కోటకు ప్రయాణమైనవారు. మార్గమధ్యమంలోని అటవికబృందము శ్రీరామానుజులవారిని శిష్యసమేతంగా చూసి ఆహో వీరు ఎవరో శ్రీవైష్ణవ స్వాములని, శ్రీరామానుజ సంబంధమే మనకు మోక్షమని మన గురువులు 'నల్లాన్' వారు చెప్పిరి కదా అని వారందరికి ఆతిథ్యము – తేనె – పండ్లు మొ॥
The Srivaishnava tradition is the simplest path for those journeying along the spiritual road. On this path, sharanagati (loving surrendering to God) holds the highest importance. Bhagavad Ramanuja (1017 CE) gave this path to all alike, without distinction of one person or another, and upon the authority of the Vedas wrote the "Sri Bhashyam" commentary on the Brahma Sutras. After Sri Ramanuja, Sri Manavala Mahamunulu (1443 CE) ascended the Srivaishnava peetham at Srirangam. To spread Sri Ramanuja's doctrine he rendered immeasurable service, and to propagate the tradition across the land he appointed great acharya purushas as the ashtadigpalakas (guardians of the eight directions) and established 74 peethams. Among them the most prominent were the acharya purushas called "Nallan", also referred to as the "Nallan Chakravarthula".
What does "Nallan Chakravarthulu" mean?
They were great practitioners of Srivaishnava dharma. Broad hearted humanists, of the Kousika, Kaundinyasa and Srivatsa gotras with the pañchārṣeya pravara (the five-sage ancestral lineage declaration). Their root ancestor was "Uruspattar Acchaan" of the time of Sri Nathamuni; under Sri Nathamuni they thoroughly mastered the ubhaya Vedantas, the two Vedantas, the Sanskrit Vedas and the Tamil Divya Prabandham. Later in their lineage, the great bhagavatas named "Acchaan" who lived in Sri Kanchipuram took refuge at the feet of Sri Manavala Mahamuni. They were compassionate, recognising all living beings as related to Sri Mahavishnu, serving them and uplifting them, generous men. Here let us learn a small legend.
Acchaan Swami used to worship Kanchi Varadar daily. One day he set out for the temple. On the way he saw some transient travelling Vaishnava swami, wearing the urdhva-pundra (Naamamu) and tulasi garlands, who had given up his body. Who he was, from what region, and why he had attained moksha thus, no one knew. Everyone who saw the body was leaving with an "alas!". Arriving at that moment, Acchaan Swami looked at him and lamented: "Ah! who is this great soul who attained the supreme abode in the Lord's presence? Who will perform the rites for his body!" Reasoning that for one who died without family there is no barrier of caste or gotra, and with the generous resolve that "to perform the funeral rites myself is itself Sri Ramanuja's command," he carried out all the rites according to the shastras as no one else would. Sri Kanchi Varadaraja Swami, speaking of him, said, "Naattukku Pollaan, Namakku Nallaan" (he is bad for the townsfolk, but good for us). When the townsfolk excommunicated him for performing the rites of an unclaimed body, the Lord, calling him "Nallan, Nallan," gave him the name Nallan as Kanchi Varadar's grace. Thereafter many took refuge in him and were uplifted. In the forest groves he granted even the tribal people the pancha-samskaras (five purifications or five sacraments) and Thirumanthra initiation as Sri Ramanuja's command. He also bears the name "Sameecheenaacharyulu" (the keepers of truth).
A second legend, once, when Krimikanta Chola threatened the life of Sri Ramanuja at Srirangam, Sri Ramanuja shed the ochre robes, donned white garments and journeyed through the forests to Melkote. The forest band along the way, seeing Sri Ramanuja with his disciples, said "Aho, these must be some Srivaishnava swamis; our gurus the Sri Nallaan told us that Sri Ramanuja-sambandha is itself our liberation," and offered them all hospitality with honey and fruits.
సమర్పించినారు. ఆ సమయములో వారి భక్తిప్రపత్తులకు ఆచార్యభక్తికి ఆశ్చర్యపడిన శ్రీరామానుజులు వారు
అని ఆశీర్వదించిరి. 'చక్రవర్తి' అని బిరుదాన్ని వహించిన అచ్చాన్ స్వామివారు మహావిష్ణు భక్తికలిగిన గొప్ప కాలమేఘము కదా! ఆ కాల మేఘము ఈ అడవిలో కూడా వర్షిస్తున్నది. కదా అని వారి అనుయాయి శిష్యులు ఇంత ఆచార్య భక్తిని కలవారు కదా! అని మెచ్చుకొనిరి.
"చక్రవర్తి" బిరుదము
భగవద్రామానుజలవారు "తిరుమల" శ్రీవేంకటేశ్వరుని శ్రీమన్నారాయణుడు అని స్థాపించు సమయమంలో అలనాటి శైవులను శాక్తేయులను తదితర సాంప్రదాయ పండితులతో యాదవ రాజు కొలువులో వాదోపవాదాలు చేసి విజయమును సాధించిరి. ఆ సమయములో నల్లాన్ ఆచ్చాన్ స్వామి చేసిన సేవలకు వాదోపవాదాలకు సాక్షాత్తు శ్రీనివాసుడే మెచ్చి "చక్రవర్తి" అని ప్రేమతో బిరుదమునిచ్చెను. నాటి నుండి నల్లాన్ వారు నల్లాన్ చక్రవర్తుల వారుగా లోకములో ప్రసిద్ధిపొందిరి.
అని పెద్దల శ్రీసూక్తి. శ్రీ వేంకటేశ్వర అనుగ్రహంతో వాదోపవాదాలు చేయుటచే చక్రవర్తి అని ప్రసిద్ధిపొందిన జగద్గురువులకు నమస్సులు.
ఈ నల్లాన్ చక్రవర్తుల వారు శ్రీరామానుజ సిద్ధాంత ప్రచారమునకై శాఖోపశాఖలుగా భారతదేశములో శ్రీరంగము నుండి విస్తరించిరి. శ్రీరంగం ప్రాంతమునున్న వారికి, శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వారని, తిరుమల పరిసర ప్రాంతమున నివసించినవారికి తిరుమల నల్లాన్ అని ఆయా ప్రాంతముల బట్టి వీరిని వ్యవహరించుట పరిపాటి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శాఖల వారిని అష్టగోత్రీకులలో మఱి ఇతరత్ర దర్శించవచ్చు. వీరు ఎక్కువగా సంగీత సాహిత్య గోష్ఠులను భగవత్పరముగా నిర్వహించిన విద్వాంసులు. ఇంతటి వారి వంశవృక్షమును తమ పెద్దలనాటి నుండి వచ్చిన దానిని క్రీ॥శే॥ ఉ.వే. శ్రీమాన్ యన్.సి.యస్. వెంకటాచార్యుల వారు (వ్యాకరణ విద్వాంసులు, శతావధానులు) అజంతా ప్రెస్ వారని ప్రసిద్ధి చెందిన వారు. వారి కుమారులు శ్రీమాన్ యన్.సి. వేణుగోపాల్ గారు ముద్రించుటకై ప్రయత్నించుట ఎంతో గొప్ప విషయము.
వంశ వృక్షము వ్రాయుటలో పూర్వీకుల నామధేయములు వచ్చిన వారివే వచ్చుట కాలనిర్ణయమునకు పెద్ద అంతరాయమే, అయినా విజ్ఞుల సలహాల మేరకు వాటిని పరిష్కరించుకొనుచూ ఈ కౌశిక నల్లాన్ చక్రవర్తుల (ఇంటిపేరు గల) వారి వంశవృక్ష రచనకై చేయు కైంకర్యమును శ్రీవైష్ణవ భాగవతోత్తములు పెద్ద మనస్సుతో ఆస్వాదించి అనుగ్రహించవలెనని దాసుని విజ్ఞాపన.
ఇట్లు
సాహిత్య శిరోమణి, డా॥ యమ్.టి. ఆళ్వార్
At that time Sri Ramanuja, astonished at their devotion and their reverence for their acharya, blessed them thus:
(Renowned as a Chakravarti, an emperor and a master who has crossed to the far shore of the Vishnu doctrine, Nallan, like a timely raincloud, pours down his grace in the midst of the forest)
Acchaan Swami, who bore the title "Chakravarti," is a great cosmic rain cloud (kaalamegha) filled with devotion to Mahavishnu, and that cloud rains (wisdom) even in this forest! So his followers and disciples marvelled at the depth of his acharya-devotion and praised him.
The "Chakravarti" Title
When Bhagavad Ramanuja established that the "Tirumala" Sri Venkateswara is Sri Mannarayana, in the court of the Yadava king he held debates with the Shaivas, Shaktas and other traditional scholars and prevailed. For the service and the debates of Nallan Acchaan Swami at that time, Sri Srinivasa himself, well pleased, lovingly bestowed the title "Chakravarti." From then on, the Nallan became renowned in the world as the Nallan Chakravarthula.
(By the grace of Sri Venkatesha, through his service in the assembly he prevailed in debate and, wielding the chakra, became renowned as "Chakravarti", the world teacher, the Jagadguru.)
So say the sacred words of our wise elders. Salutations to the Jagadguru who became renowned as "Chakravarti" through holding debates by the grace of Sri Venkateswara.
This Nallan Chakravarthula’s clan spread as branches and sub-branches across India from Srirangam to propagate Sri Ramanuja's doctrine. Those in the Srirangam region came to be called Srirangam Nallan Chakravarthula, and those who lived near Tirumala as Tirumala Nallan, named by their region. In our Telugu states too these branch members may be seen among the ashtagotrikas (The eight-lineage group) and elsewhere. They were largely scholars who pursued music and literature in a devotional spirit. This family tree of theirs, handed down from their elders, was the work of the late Sriman N.C.S. Venkatacharyulu garu (a grammarian and shatavadhani) renowned as Ajanta Press; that his son Sriman N.C. Venugopal garu has striven to print it is a most worthy thing.
In writing a family tree, the fact that only the names of those ancestors who came down to us are available is a great obstacle to fixing dates; yet, resolving these as far as the advice of the learned permits, it is this servant’s humble plea that the most excellent Srivaishnava bhagavatas may, with large hearts, savour and bless this kainkarya (selfless dedication) undertaken for the composition of the family tree of the Kousika Nallan Chakravarti (house-name) vaaru.
Yours,
Sahitya Shiromani, Dr M.T. Alwar
మనం వంశం, వంశ వృక్షాలను గురించి తెలుసుకున్నాము. వంశం అభివృద్ధి చెందినపుడే వంశ వృక్షం పెరుగుతుంది. ఇది అనంతమైన ప్రక్రియ. నా శక్తి మేరకు కృషి చేసి ఇన్ని తరాలు సంకలనం చేసాను. దీనికి నా కుటుంబ సభ్యులు, నా భార్య వసుంధర మా పిల్లలు డా॥ యన్.సి. సుమన, యన్.సి. సునీల్, యన్.సి. సురేష్, అల్లుడు నరసింహాచార్యులు, కోడళ్ళు ఇందిరా ప్రియ దర్శిని, హేమ, మనువరాళ్లు సుష్మ, సుప్రియ, సుమేధ నన్ను మొదటి నుంచి ప్రోత్సహించి ఈ పుస్తకం వెలుగులోకి తీసుకు రావడానికి మీ ముందు ఉంచడానికి నా ప్రక్కనే ఉండి ఎంతో కృషి చేసారు. వారికి నేను సర్వదా కృతజ్ఞుడను.
ఆసక్తి గల వారు దీనిని విస్తరించే ప్రయత్నము చేయాలి అప్పుడే కొత్త తరాల గురించి తెలుస్తుంది. ఈ కృషి ఏ కొందరైనా చేస్తారనే నమ్మకంతో ఇప్పటికి ముగిస్తున్నాను.
ఇట్లు
మీ
స్వర్గీయ శ్రీ యన్. సి. వేణుగోపాల్
B.Sc., B Pharm.
We have learned about lineage and family trees. A family tree grows only as the lineage itself grows; it is an endless process. To the best of my ability, I have made the effort and compiled these many generations. In this, my family members my wife Vasundhara; our children Dr N.C. Sumana, N.C. Sunil and N.C. Suresh; son-in-law Narasimhacharyulu, daughters-in-law Indira Priyadarshini and Hema; and granddaughters Sushma, Supriya and Sumedha encouraged me from the very beginning and worked hard, staying right beside me, to bring this book to light and place it before you. To them I am ever grateful.
Those with interest should strive to expand this, for only then will newer generations come to be known. With the belief that some among you will take up this work, I conclude for now.
Yours,
Late Sri N. C. Venugopaal
B.Sc., B Pharm.
వంశవృక్షం గురించి మీ జ్ఞాపకాలు, సూచనలు లేదా సరిదిద్దుబడ్లను పంచుకోండి. మీ సందేశం క్రింద అందరికీ కనబడుతుంది.Share your memories, suggestions, or corrections about the family tree. Your message will appear below for everyone to see.